: శ్రీదేవి అందాన్ని ఆమె భర్త ముందే ప్రస్తావించాను: దర్శకుడు వర్మ


'శ్రీదేవి అందాల గురించి ఆమె భర్త బోనీకపూర్ ముందే ప్రస్తావించాను.. ప్రశంసించాను' అని దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. ‘ఒక వ్యక్తికి భార్య అయిన శ్రీదేవి అందాల గురించి మాట్లాడటం పద్ధతి కాదు కదా?’ అని ఒక టీవీ ఛానల్ లో అడిగిన ప్రశ్నకు వర్మ పైవిధంగా సమాధానమిచ్చారు. గతంలో తాను రాసిన ‘నా ఇష్టం’ అనే పుస్తకంలో శ్రీదేవి గురించి రాశానని... అదంతా ఆమెకు వినిపించానని అన్నారు. అంతేకాకుండా, శ్రీదేవి అందాల గురించి తాను పొగుడుతుంటే.. శ్రీదేవి, బోనీకపూర్ ముసిముసి నవ్వులు నవ్వుకున్న సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. శ్రీదేవి నటించిన పదహారేళ్ల వయస్సు చిత్రాన్ని తాను చాలా సార్లు చూశానని... అందుకు కారణం ఆమె చూపించిన అందాలేనని అన్నారు. బాలీవుడ్ లో శ్రీదేవి నటించిన 'హిమ్మత్ వాలా' చిత్రంలో ఆమె స్విమ్ సూట్ ధరించిన విషయాన్ని కూడా వర్మ ప్రస్తావించారు. ‘ఒకరి అందాల గురించి నేను ప్రస్తావించినప్పుడు అసలు వ్యక్తులు ఎటువంటి ఇబ్బంది పడనప్పుడు మీకేంటి అభ్యంతరం?’ అని వర్మ తిరిగి ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News