: విశాఖ అందాలకు ఫిదా అయిన రోహిత్ శర్మ


భారత క్రికెటర్ రోహిత్ శర్మను విశాఖ ప్రకృతి అందాలు బాగా ఆకట్టుకున్నాయి. దాంతో ఆ నగరంపై ప్రేమ కురిపించేస్తున్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ లో భాగంగా భారత జట్టు వైజాగ్ లో పర్యటించిన సంగతి విదితమే. ఈ సందర్భంగా రోహిత్ తన కెమెరాలో బంధించిన కొన్ని ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. అంతేగాకుండా "స్వచ్ఛమైన నీరు... పరిశుభ్రమైన రహదారులు... ఆహ్లాదకరమైన జీవనం... అందుకే విశాఖపట్నం నన్నెంతగానో ఆకట్టుకుంది" అంటూ రోహిత్ నగరాన్ని మెచ్చుకున్నాడు. మరో విషయమేంటంటే, అతని 'మాతృ'భాష తెలుగు. అతని తల్లి విశాఖకు చెందిన వారే. ఈ విషయాలను గతంలో రోహిత్ వెల్లడించాడు కూడా.

  • Loading...

More Telugu News