: హనుమాన్ జంక్షన్ లో కాలి బూడిదైన వేల టన్నుల బెగాస్


కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్దనున్న డెల్టా షుగర్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో వేల టన్నుల బెగాస్ అగ్నికి ఆహుతైంది. చెరకు నుంచి రసాన్ని వేరు చేసిన అనంతరం బయటపడే పిప్పి (బెగాస్)ని కంప్రెస్ చేసి, బ్లాకులుగా చేసి ఉంచుతారు. దీనిని కాగితం తయారీలో వినియోగిస్తారు. ఇలా వెలువడిన వేల టన్నుల బెగాస్ ను రాసులుగా పోసి కంపెనీ బహిరంగ ప్రదేశంలో స్టోర్ చేసింది. దీనికి నిప్పంటుకుంది. మంటలు ఎగసిపడడంతో వేల టన్నుల బెగాస్ అగ్నికి ఆహుతైంది. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. కాగా, ఈ అగ్నిప్రమాదంపై డెల్టా షుగర్ ఫ్యాక్టరీ ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News