: యువతకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ హెచ్చరిక!
దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే యువతపై కఠిన చర్యలు తప్పవని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయూద్ చేసిన ట్వీట్ ను ఆయన ప్రస్తావించారు. భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయవద్దని యువతకు సూచించారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్ యూ) తో పాటు దేశంలోని విద్యార్థులందరినీ చైతన్యపరిచే విధంగా ఢిల్లీ పోలీసు అధికారిక ట్విట్టర్ ద్వారా ఒక సందేశాన్ని పోస్ట్ చేసినట్లు ఆయన చెప్పారు. పార్లమెంట్ పై దాడి కేసులో దోషి అఫ్జల్ గురు చిత్ర పటాన్ని జేఎన్ యు లో ఊరేగించడం వంటి సంఘటనలకు ఎవరైనా పాల్పడితే తీవ్రంగా పరిగణిస్తామని, కఠిన శిక్షలు తప్పవని బస్సీ పేర్కొన్నారు.