: పెళ్లయిన మూడు రోజులకే వదిలి యూకే వెళ్లిపోయాడు
విదేశీ వరుడికి భారతదేశంలో ఉన్న గిరాకీ మరే దేశంలోనూ ఉండదంటే అతిశయోక్తికాదు. విదేశీ వరుడు అయితే చాలు, ఇంకేం చూడాల్సిన అవసరం లేదని, లక్షలకు లక్షలు పోసి అమ్మాయిలను కట్టబెడుతుంటారు. తాజాగా మ్యాట్రిమొనీ సైట్లు వచ్చిన తరువాత వివాహం తంతు మరింత అపహాస్యమవుతోంది. ఇలా మ్యాట్రిమొనీ సైట్ ద్వారా పరిచయమైన అమ్మాయితో మాట కలిపి, ప్రేమించినట్టు నాటకమాడి, వివాహం చేసుకున్న యువకుడు పెళ్లైన మూడు రోజులకే ఆమెకు చెప్పాపెట్టకుండా బిచాణా ఎత్తేసి, యూకే వెళ్లిపోయాడు. దీంతో వరంగల్ జిల్లాకు చెందిన ఆ యువతి డీజీపీని ఆశ్రయించింది. దీంతో ఎల్బీ నగర్ కు చెందిన శ్రవణ్ అనే ఈ యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.