: మద్యం సేవించి కోర్టుకు వెళుతున్న మహిళా జడ్జి అరెస్టు!


ఉన్నతమైన పదవిలో ఉన్న ఒక మహిళా జడ్జి మద్యం సేవించి కోర్టుకు వెళుతుండగా ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన అమెరికాలోని న్యూయార్క్ లో జరిగింది. మద్యం సేవించిన మహిళా జడ్జి లెటిషియా అస్టాషియో తన వాహనంలో కోర్టుకు వెళుతోంది. మార్గమధ్యంలో న్యూయార్క్ స్టేట్ ట్రూపర్స్ ఆమెను అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం ఆమెను కోర్టుకు తరలించారు. ఈ కేసు విచారణను వచ్చే నెలకు వాయిదా వేస్తున్నట్లు మాన్రో కౌంటీ జిల్లా అటార్నీ సాండ్ర డూర్లే పేర్కొన్నారు. కాగా, అస్టాషియో స్థానంలో కొత్త న్యాయమూర్తిని నియమించినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనపై నిందితురాలైన అస్టాషియో కానీ, న్యూయార్క్ న్యాయస్థానం విభాగం కానీ ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. కాగా, 2014లో అస్టాషియోను జడ్జిగా నియమించారు.

  • Loading...

More Telugu News