: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రయాణికుల 'రిజర్వేషన్' కష్టాలు!


నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పనిచేసేవాటి కన్నా, పనిచేయని రిజర్వేషన్ కౌంటర్లే ఎక్కువగా ఉన్నాయి. దీంతో రిజర్వేషన్ నిమిత్తం వచ్చే ప్రయాణికులు ఎంత ముందుగా వచ్చినప్పటికీ పని కావడం లేదు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్లు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయి. ఇక్కడ మొత్తం 20 రిజర్వేషన్ కౌంటర్లు ఉండగా, వాటిలో పని చేసేవి మూడు మాత్రమే. దీంతో గంటల తరబడి క్యూలో నిలబడాల్సి రావడమే కాకుండా, కన్ఫార్మ్ అవుతుందనుకున్న టిక్కెట్ వెయిటింగ్ లిస్ట్ లోకి వెళ్లిపోతోందని ప్రయాణికులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు తక్షణం స్పందించి ఆయా కౌంటర్లను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

  • Loading...

More Telugu News