: ఆరేళ్లలో ఒక్క రోజు కూడా విధులకు రాకపోయినా ఎవరూ గుర్తించలేదు!
జాక్విన్ గర్సియా... 69 ఏళ్ల ఈ పెద్దమనిషి ఓ వాటర్ కంపెనీలో పనిచేస్తుంటాడు. సుదీర్ఘకాలంగా విధులను నిర్వహిస్తున్న వారికి అవార్డులు ఇవ్వాలని భావించిన సంస్థ జాక్విన్ ను గుర్తించింది. తీరా చూస్తే, అతను ఆరేళ్ల నుంచి ఒక్క రోజు కూడా విధులకు హాజరు కాలేదని తెలుసుకున్న అధికారులు అవాక్కయ్యారు. అసలు విషయం ఏంటంటే, ఉన్నతాధికారుల మధ్య ఉన్న విభేదాలను జాక్విన్ అలుసుగా తీసుకుని విధులకు ఎగనామం పెట్టడం స్టార్ట్ చేశాడు. 20 ఏళ్ల పాటు సేవలు చేసిన వ్యక్తిగా అతనికి మొమెంటోను ఇవ్వాలని భావించిన సంస్థ అప్పుడు అసలు విషయాన్ని గుర్తించింది. ఈ కేసు కోర్టుకెక్కగా, అతని వార్షిక జీతంలో పన్ను మినహాయించి 27 వేల యూరోలను జరిమానాగా విధించింది. ఈ ఆరేళ్లూ అతను కనిపించకపోయినా, వేతనాన్ని చెల్లిస్తూ వచ్చిన కంపెనీకి చివాట్లు పెట్టింది. కాగా, తాను కార్యాలయానికి వెళితే, అక్కడ పని ఉండటం లేదని, ఆ కారణం చేతనే వెళ్లడం మానేశానని గార్సియా కోర్టుకు తెలిపాడు.