: ఏపీ సహా మరో ఐదు రాష్ట్రాలకు కేంద్ర కరవు సాయం


దేశంలోని ఆరు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కరవు సహాయ నిధిని మంజూరు చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు రూ.280.19 కోట్లు ఇవ్వనుంది. తమిళనాడుకు రూ.1,773 కోట్లు, అసోంకు రూ.332.57 కోట్లు, హిమాచల్ ప్రదేశ్ కు రూ.170.19 కోట్లు, జార్ఖండ్ కు రూ.336 కోట్లు, రాజస్థాన్ కు రూ.1,177 కోట్లు మంజూరు చేశారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఇవాళ ఉన్నతస్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో రాష్ట్రాల్లో చేపట్టిన కరవు సహాయ చర్యలపై సమీక్షించారు. ఆయా రాష్ట్రాల కరవు బృందాలు ఇచ్చిన నివేదికల ఆధారంగా కరవు సహాయనిధి నుంచి నిధులను మంజూరు చేయాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News