: ఆ న్యాయమూర్తికి ఏ కేసులూ ఇవ్వద్దు: భారత చరిత్రలో తొలిసారిగా సుప్రీం ఆదేశం


భారత చరిత్రలో తొలిసారిగా, ఓ న్యాయమూర్తికి ఏ విధమైన కేసులనూ విచారించేందుకు అప్పగించరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. మద్రాస్ హైకోర్టులో వివాదాస్పద న్యాయమూర్తిగా పేరు తెచ్చుకున్న జస్టిస్ సీఎస్ కర్నాన్ కు కేసులు ఇవ్వద్దని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ అధ్యక్షతన ఏర్పాటైన న్యాయమూర్తుల కమిటీ ఈ ఆదేశాలు జారీ చేసింది. తాను షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తిని కావడంతో మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజయ్ కౌల్ తనపై వివక్ష చూపుతున్నారంటూ జస్టిస్ కర్నన్ ఆమధ్య తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మద్రాస్ హైకోర్టు సుప్రీం కోర్టుకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో దీనిని విచారించిన సుప్రీం కోర్టు ఆయనకు కేసులు ఇవ్వొద్దని ఆదేశించింది.

  • Loading...

More Telugu News