: సియాచిన్ మంచుతుపానులో మరణించిన సైనికులకు నివాళులు


జమ్ము కశ్మీర్ లోని సియాచిన్ లో ఇటీవల మంచుతుపాను కారణంగా వీరమరణం పొందిన 9 మంది సైనికుల మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతకుముందు లేహ్ నుంచి ఢిల్లీలోని పాలం ఎయిర్ పోర్టుకు తీసుకువచ్చిన భౌతికకాయాలకు ప్రభుత్వ లాంఛనాలతో త్రివిధ దళాల అధికారులు ఘనంగా నివాళులర్పించారు. తరువాత స్వస్థలాలకు తరలించనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముస్తాక్ అహ్మద్ భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయానికి తీసుకురానున్నారు. అక్కడ పలువురు నివాళులర్పించాక కర్నూలు తీసుకువెళతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పార్నెపల్లి గ్రామానికి తరలిస్తారు. అనంతరం పూర్తిస్థాయి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News