: ప్రజలకు 'ఏడాది పాలన' కానుకిచ్చిన కేజ్రీవాల్!
ఢిల్లీలో ప్రభుత్వాన్ని ప్రారంభించి ఏడాది గడిచిన సందర్భంగా కేజ్రీవాల్ ప్రజలకు ఓ బహుమతిని ప్రకటించారు. పేదలు కట్టాల్సిన మంచినీటి బిల్లులన్నింటినీ రద్దు చేస్తున్నట్టు తెలిపారు. నవంబర్ 2015 వరకూ బకాయిపడ్డ బిల్లు మొత్తాన్ని రద్దు చేస్తున్నామని, ఆ బిల్లులు పాక్షికంగా చెల్లించివున్నా, పూర్తిగా చెల్లించకున్నా, మిగతాది కట్టక్కర్లేదని తనకు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి కేజ్రీవాల్ తెలిపారు. కాగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించకముందు నల్లా బిల్లులను కట్టవద్దని కేజ్రీవాల్ పలుమార్లు ప్రజలకు సూచించిన సంగతి తెలిసిందే. కాగా, ఆర్థికంగా వెనుకబడినవారికి నీటి బిల్లులన్నీ పూర్తిగా రద్దు కానుండగా, ఇతర వర్గాల ప్రజలకు వారి ఆర్థిక స్తోమతను బట్టి 25 నుంచి 75 శాతం వరకూ నీటి బిల్లులు రద్దు కానున్నాయి.