: పెద్దల కోసం పేదలకు అన్యాయమా? చంద్రబాబుపై జగన్ నిప్పులు
ప్రభుత్వ పెద్దలకు అప్పనంగా దోచిపెట్టడమే ఏకైక లక్ష్యంగా చంద్రబాబు అమరావతి ప్రాంతంలో అలైన్ మెంట్లను మార్చుతున్నారని వైకాపా నేత వైఎస్ జగన్ ఆరోపించారు. రాజధాని నడిబొడ్డున అభివృద్ధి పేరు చెబుతూ పేదలకు అన్యాయం చేసే ఆలోచనలు చేస్తే, తాము చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసమంటూ రైవస్ కాలువపై ఇళ్లను తొలగించాలని అధికారులు నోటీసులు జారీ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ ఉదయం కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన, నూజివీడుకు వెళుతూ, మార్గమధ్యంలో బాధితులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ హోటల్ ఈ ప్రాంతంలో ఉందని, దానికి లాభం చేకూర్చేందుకే అలైన్ మెంట్ మారుస్తున్నారని జగన్ నిప్పులు చెరిగారు. పరిహారం ఇవ్వకుండా ఇళ్లను ఎలా కూలుస్తారని ప్రశ్నించారు.