: నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి దారుణ హత్య... పరారీలో భార్య!
నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం పడగల్ లో గంగాధర్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు అతడిని బండరాయితో మోది చంపేసి ఉంటారని తెలుస్తోంది. స్థానికుల సాయంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనలో కుటుంబ సభ్యులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుడి భార్య పరారీలో ఉండడమే అందుకు కారణం!