: వంశీ తప్పు చేస్తే శిక్ష తప్పదు: హోంమంత్రి చినరాజప్ప
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసుపై ఏపీ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇవాళ ప్రారంభమైన రాష్ట్ర వ్యాప్త జైళ్ల శాఖ పునశ్చరణ తరగతులకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వంశీ అరెస్టు విషయంలో చట్టం తన పని తాను చేసుకెళుతుందన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందని, తప్పు చేసినట్టు విచారణలో తేలితే శిక్ష తప్పదని మంత్రి చెప్పారు. మరోవైపు తుని ఘటనలో కూడా సీఐడీ విచారణ జరుగుతోందని, దోషులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.