: జగన్ బ్యాచ్ ని దీటుగా ఎదుర్కోవాలి: మంత్రులతో చంద్రబాబు


తదుపరి అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాలు చేసే విమర్శలను దీటుగా ఎదుర్కొనే దిశగా ముందే ప్రిపేర్ అయి రావాలని మంత్రివర్గ సహచరులకు సీఎం చంద్రబాబు హితబోధ చేసినట్టు తెలుస్తోంది. పలు అంశాల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైకాపా సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాలు ఉన్నందున, అన్నింటికీ సమాధానాలతో సిద్ధంగా ఉండాలని, వైకాపా స్వార్థ రాజకీయాన్ని ఎండగట్టాలని బాబు సూచించారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఈ ఉదయం మంత్రులతో సమావేశమైన చంద్రబాబు పలు అంశాలపై చర్చించారు. బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలి? కాపు కార్పొరేషన్ కు నిధులు, అసెంబ్లీ వేదికగా బీసీలకు ఇవ్వాల్సిన సందేశం తదితరాలపై ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. మార్చి 5న రాష్ట్ర బడ్జెట్, 7న వ్యవసాయ బడ్జెట్ అసెంబ్లీ ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News