: ప్రముఖుల భద్రతా విధులకు ఎన్ఎస్జీ రాంరాం!... ఒరిజినల్ డ్యూటీలకు బ్లాక్ క్యాట్ కమెండోలు


నల్లటి యూనిఫాం... చేతుల్లో అత్యాధునిక మెషీన్ గన్లు... చుట్టూ పరిసరాలపై డేగ కళ్లు... ఇదీ బ్లాక్ క్యాట్ కమెండోల ఆహార్యం. వీరి అసలు పేరు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్. ‘సర్వత్రా సర్వోత్తమ్ సురక్షా’ ట్యాగ్ లైన్ తో 1984లో ఏర్పడ్డ ఈ దళం బాధ్యత... దేశంలో ఉగ్రవాదుల పీచమణచడమే. అయితే తదనంతర కాలంలో ఎన్ఎస్జీ కమెండోలు దేశంలో ‘జెడ్ ప్లస్’ సెక్యూరిటీ హోదాలో ఉన్న ప్రముఖుల రక్షణ బాధ్యతలను కూడా భుజాన వేసుకున్నారు. ప్రస్తుతం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి కూడా బ్లాక్ క్యాట్ కమెండోలే సెక్యూరిటీ గార్డులుగా ఉన్నారు. అయితే భవిష్యత్తులో ఎన్ఎస్జీ కమెండోలు ప్రముఖుల భద్రతా విధులను వీడనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా కీలక అడుగులు వేస్తోంది. మొన్న పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో చొరబడ్డ ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రభుత్వం ఎన్ఎస్జీ కమెండోలనే రంగంలోకి దించిన సంగతి తెలిసిందే. రంగంలోకి దిగిన గంటల వ్యవధిలోనే ఎన్ఎస్జీ కమెండోలు ఉగ్రవాదుల పీచమణిచారు. ఈ ఉదంతంలో ప్రస్తుతం ఎన్ఎస్జీ వింగ్ లోని దాదాపు 600 మంది కమెండోలను ప్రభుత్వం ప్రముఖుల భద్రతా విధుల్లో నుంచి తప్పించింది. సమీప భవిష్యత్తులో మిగిలిన కమెండోలను కూడా పూర్తిగా ఉగ్రవాద నిర్మూలన (కౌంటర్ టెర్రరిజం) విధులకే మళ్లించనుంది.

  • Loading...

More Telugu News