: 'రాయీస్' చిత్రీకరణను వ్యతిరేకిస్తూ షారుఖ్ కారుపై వీహెచ్ పీ దాడి
కొన్ని నెలల కిందట బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ చేసిన అసహనం వ్యాఖ్యలు అతనిని ఇంకా వెంటాడుతునే వున్నాయి. ఇందుకు నిరసనగా ఆయన కొత్త చిత్రం 'రాయీస్' చిత్రీకరణను వ్యతిరేకిస్తూ ఖాన్ కారుపై వీహెచ్ పీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. గుజరాత్ లోని 'హయత్ రీజెన్స్' హోటల్ పార్కింగ్ స్థలంలో ఖాన్ వాహనం నిలిపి ఉంచిన సమయంలో ఈ దాడి జరిగింది. దాదాపు 10 మంది బైక్ లపై వచ్చి షారుఖ్ కారుపై రాళ్లు రువ్వారని పోలీసులు తెలిపారు. ఆ వెంటనే ఏడుగురిని అరెస్టు చేశారు. దాడి చేసింది తామేనని వీహెచ్ పీ రాష్ట్ర విభాగం ప్రకటించింది.