: ప్రమాదం వెనుక కుట్ర... ఫడ్నవీస్ అనుమానం!


నిన్న రాత్రి ముంబై చౌపాటీ బీచ్ లో జరిగిన అగ్ని ప్రమాదం వెనుక విద్రోహ కుట్ర ఉండవచ్చన్న కోణంలో విచారణ ప్రారంభమైంది. అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన వేదికపై అగ్నిప్రమాదం అంత సులువు కాదని అభిప్రాయపడ్డ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, పూర్తి విచారణకు ఆదేశించారు. దీంతో ముంబై క్రైం బ్రాంచ్ తో పాటు, ఎన్డీఎఆర్ఎఫ్ అధికారులు రంగంలోకి దిగారు. అగ్రిప్రమాదంలో దగ్ధమైన వస్తువులు, తొలుత అగ్ని కీలలు లేచిన ప్రదేశం నుంచి పలు నమూనాలు సేకరించారు. తాము అన్ని జాగ్రత్తలూ తీసుకున్నప్పటికీ, ఈ ప్రమాదం జరిగిందని, దీనికి కారణాలు అన్వేషిస్తామని, 'కుట్ర కోణం' దిశగానూ విచారణ సాగుతుందని ఫడ్నవీస్ ఈ ఉదయం వెల్లడించారు. సీనియర్ నటి హేమమాలిని, బిగ్ బీ అమితాబ్ ల ప్రదర్శన ముగియగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News