: అదే అదృష్టం... ప్రణీత ప్రాణాలు మిగిల్చింది!
నిన్న సినీనటి ప్రణీత కారుకు యాక్సిడెంట్ జరిగిందని తెలియగానే సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. ఆ వెంటనే ఆమెకు స్వల్పగాయాలు మినహా ప్రమాదం లేదని తెలుసుకుని ఊపిరి పీల్చకుంది. ఖమ్మంలో ఒక షాపింగ్ మాల్ ను ప్రారంభించిన అనంతరం తిరిగి హైదరాబాద్ కు వస్తున్న ఆమె కారు బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమె సీట్ బెల్ట్ పెట్టుకుని కూర్చుంది. అదే ఆమె పాలిట అదృష్టమైంది. ముందు సీట్లో కూర్చున్న ఆమె సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే, కారు బోల్తా కొట్టిన తీరుకు పెను ప్రమాదమే జరిగివుండేది. ఆమె కదలకుండా సీట్ బెల్ట్ పట్టి ఉంచడంతోనే స్వల్ప గాయాలతో బయటపడగలిగింది. కారులో ప్రయాణించేటప్పుడు ముందు సీట్లలోని వారికి సీట్ బెల్ట్ ఎంత అవసరమో ఈ ఘటన మరోసారి నిరూపించింది.