: నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు... ఇచ్చిన రన్స్ ఎనిమిదే!: సత్తా చాటిన అశ్విన్


సాగర నగరం విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వీసీఏ-వీడీసీఏ స్టేడియంలో నిన్న జరిగిన టీ20 మ్యాచ్ లో టీమిండియా స్పిన్ వీరుడు రవిచంద్రన్ అశ్విన్ సత్తా చాటాడు. వేసింది నాలుగు ఓవర్లే అయినా, నాలుగు వికెట్లు తీశాడు. ఈ నాలుగు ఓవర్లలో ఓ ఓవర్ లో పరుగులేమీ ఇవ్వని అతడు, మిగిలిన మూడు ఓవర్లలో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. వెరసి అతడిచ్చిన పరుగుల శాతం రెండుగానే నమోదైంది. టీమిండియా బౌలింగ్ ను స్పిన్ తో ప్రారంభించిన మహేంద్ర సింగ్ ధోనీ వ్యూహం తప్పు కాదని అశ్విన్ నిరూపించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ ను వేసిన అశ్విన్... మూడో బంతికే నిరోశాన్ డిక్ వెల్లా(1)ను ఔట్ చేశాడు. ఇక చివరి బంతికి లంక దిగ్గజ బ్యాట్స్ మన్ తిలకరత్నె దిల్షాన్(1) ను బోల్తా కొట్టించాడు. వీరిద్దరూ సింగిల్ పరుగుకే వెనుదిరగడం విశేషం. ఇక ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన అశ్విన్ లంక కెప్టెన్ దినేశ్ చండీమాల్ (8)ను కూడా ఔట్ చేశాడు. ఆ తర్వాత తన మూడో (ఇన్నింగ్స్ ఐదో) ఓవర్ లోనూ బంతిని గింగిరాలు తిప్పిన ఈ చెన్నై బౌలర్... అసేల గుణరత్నే(4)ను కూడా బోల్తా కొట్టించాడు. క్రీజులోకి వచ్చిన తొలి నలుగురు లంక బ్యాట్స్ మెన్ అశ్విన్ బౌలింగ్ లోనే ఔటయ్యారు. ఈ క్రమంలో లంక టాపార్డర్ ను కుప్పకూల్చి భారత విజయానికి రాచబాట పరిచిన అశ్విన్ కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

  • Loading...

More Telugu News