: ఈ అరాచకం కన్నా నక్సలిజం వస్తే బాగుంటుంది: రేవంత్ రెడ్డి
ప్రస్తుతం తెలంగాణలో నక్సలిజం వస్తే బాగుంటుందని భావిస్తున్నట్టు టీటీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలన అరాచకంగా సాగుతోందని, ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని నిప్పులు చెరిగిన ఆయన, ఒకప్పుడు నక్సలిజం అభివృద్ధికి నిరోధకమని తాను భావించేవాడినని, ఇప్పుడు మాత్రం నక్సలైట్ల రాజ్యం ఉంటేనే మంచిదనుకుంటున్నానని అన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ, నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్లో ఆయన పాల్గొన్నారు. యూనివర్శిటీల్లో యువత నక్సలిజం పట్ల ఆకర్షితులవుతున్నారని, సాగర్, శృతి ఇదే విధంగా వెళ్లి, వరంగల్ ఎన్ కౌంటర్ లో మరణించారని అన్నారు. కేసీఆర్ అధికారం చేపట్టిన తొమ్మిది నెలల్లోనే ఎన్ కౌంటర్ జరిగిందని గుర్తు చేశారు.