: సహజీవనం ఎఫెక్ట్!... నెల్లూరులో ఓ భర్తకు చెప్పుదెబ్బలు, అటకెక్కిన మహిళ


పద్నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న భార్యకు ఓ భర్త మస్కా కొట్టాడు. ఇల్లు, ఇల్లాలు, ఇద్దరు పిల్లలను గాలికి వదిలేసిన సదరు భర్త మరో మహిళతో గుట్టుచప్పుడు కాకుండా సహజీవనం సాగిస్తున్నాడు. ఎట్టకేలకు భర్తగారి నిజరూపం తెలుసుకున్న ఆ భార్యామణి అపర కాళికే అయ్యింది. భర్త, ఆ మహిళను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని శివంగిలా మారింది. భర్తపై చెప్పులతో విరుచుకుపడిన ఆ భార్యామణి విశ్వరూపానికి బెంబేలెత్తిన ‘సహజీవనం’ మహిళ ఆ దెబ్బల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా అటకెక్కి కూర్చుంది. ఈ అరుదైన ఘటన ఏపీలోని నెల్లూరులో చోటుచేసుకుంది. భార్యకు టోకరా ఇచ్చి మరో మహిళతో అనధికారికంగా కాపురం వెలగబెడుతున్న వెంకటేశ్ అనే వ్యక్తిపై అతడి భార్య చెప్పులతో దాడి, అతడితో సహజీవనం సాగిస్తున్న మహిళ అటకెక్కి బిక్కుబిక్కుమంటూ కూర్చున్న వైనం, ఆమెను కిందకు లాగుతున్న అతడి భార్య... తదితర దృశ్యాలు ఓ న్యూస్ ఛానెల్ కు చిక్కాయి. ఈ దృశ్యాలను ఆ ఛానెల్ ప్రముఖంగా ప్రసారం చేసింది. దాడితో సరిపెట్టుకోని ఆ భార్య తన భర్త వెంకటేశ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను నిండా ముంచిన అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

  • Loading...

More Telugu News