: బెజవాడలో ‘క్యాట్ వాక్’లు... టాలీవుడ్ మిస్ ఏపీగా నెల్లూరు ముద్దుగుమ్మ!


నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడలో క్యాట్ వాక్ లు హోరెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా హైదరాబాదు, విశాఖలకు మాత్రమే పరిమితమైన అందాల పోటీలు తాజాగా విజయవాడలోనూ ప్రారంభమయ్యాయి. నిన్న రాత్రి ఫ్యూచరాల్ సంస్థ ఆధ్వర్యంలో ‘టాలీవుడ్ మిస్ ఏపీ-2015’ పేరిట అందాల ముద్దుగుమ్మలు ర్యాంప్ పై హొయలు పోయారు. టాలీవుడ్ హాస్య నటులు బ్రహ్మానందం, అలీలు హాజరైన ఈ అందాల పోటీల్లో టాలీవుడ్ మిస్ ఏపీ-2015గా నెల్లూరుకు చెందిన సునయ మొహ్మద్ ఎంపికైంది. ఈ తరహా పోటీలతో టాలీవుడ్ కు హీరోయిన్ల కొరత తీరనున్నట్లు బ్రహ్మానందం పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News