: శ్రీలంక జట్టు 82 పరుగులకే ఆలౌట్!
మూడో టీ 20 మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు కేవలం 82 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాట్స్ మెన్లు 9 మంది సింగిల్ డిజిట్ స్కోరు వద్దే చతికిలపడ్డారు. శనక(19), పెరీరా(12) మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. 18 ఓవర్లు ఆడిన శ్రీలంక కేవలం 82 పరుగులు మాత్రమే చేసింది. కాగా, అశ్విన్ 4, రైనా 2, జడేజా, బుమ్రా, నెహ్రాలు ఒక్కొక్క వికెట్ చొప్పున తీసుకున్నారు.