: మళ్లీ విజేత తెలుగు వారియర్సే!


హైదరాబాద్ ఉప్పల్ లో జరిగిన సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)-6 ఫైనల్స్ లో కర్నాటక బుల్డోజర్స్ పై తెలుగు వారియర్స్ విజయం సాధించింది. ఒక వికెట్ మాత్రమే కోల్పోయిన తెలుగు వారియర్స్ 17.4 ఓవర్లలో 211 పరుగులతో లక్ష్యాన్ని ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కర్నాటక బుల్డోజర్స్ 208 పరుగులు చేసింది. అఖిల్ అక్కినేని సారథ్యంలోని తెలుగు వారియర్స్ భారీ లక్ష్య సాధనకు దిగి విజయం సాధించింది. ఓపెనర్లు సచిన్ జోషి(114) ప్రిన్స్(61 నాటౌట్) బాగా రాణించారు. సచిన్ జోషి ఔటైన తర్వాత కెప్టెన్ అఖిల్ అక్కినేని 25 పరుగులతో దూకుడుగా ఆడి గెలుపు బాట పట్టించాడు. దీంతో సీసీఎల్ లో తెలుగు వారియర్స్ రెండోసారి విజేతగా నిలిచినట్లయింది.

  • Loading...

More Telugu News