: ఉస్మానియా యూనివర్శిటీలో ఉద్రిక్తత!
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో ప్రేమికుల దినోత్సవాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎస్ఆర్ఎస్ హాస్టల్ వద్ద ఈరోజు సాయంత్రం వేలెంటైన్స్ డే వేడుకలు జరుపుకుంటున్న విద్యార్థులను పోలీసులు నిలువరించారు. దీంతో విద్యార్థులు ప్రతిఘటించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సుమారు 20 మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.