: ఆ చిన్నారి నటన నన్ను డామినేట్ చేసింది: నాని


'కృష్ణ గాడి వీర ప్రేమగాథ' సినిమాలో నటించిన ముగ్గురు చిన్నారులు బాగా చేశారని హీరో నాని అన్నాడు. అయితే, నైని అనే చిన్నారి చేసిన నటన తనను డామినేట్ చేసిందని చెప్పాడు. ఈ పాత్ర 'బెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్' అని, నైని తనతో పోటీ పడి నటించలేదని, జస్ట్ డామినేట్ చేసేసిందని, చాలా బాగా చేసిందని నాని ప్రశంసించాడు. సినిమాలో ఆమె పాత్రను చూస్తున్న ప్రేక్షకులు మైమరచిపోతున్నారని, చాలా ముద్దుగా చేసిందని కితాబిచ్చాడు. రాయలసీమ ప్రజలు చాలా ప్రేమగా, మర్యాదగా ఉంటారని, ఆ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉందని అన్నాడు. ఈ చిత్రం మంచి ఎంటర్ టెయినర్ అని, చిన్న పిల్లలతో పాటు ఈ సినిమాను అందరూ చూడవచ్చని.. ఎటువంటి అభ్యంతరకర సన్నివేశాలు ఈ చిత్రంలో లేవని నాని చెప్పాడు.

  • Loading...

More Telugu News