: వేలెంటైన్స్ డే ను పట్టించుకోను: హీరో నాని


వేలెంటైన్స్ డే ను పట్టించుకోనని, తనకు మొదటి నుంచి దీనిపై ప్రత్యేక అభిమానమేదీ లేదని ప్రముఖ హీరో నాని అన్నారు. ‘మీది కూడా లవ్ మ్యారేజే కదా!.. వేలెంటైన్స్ డే జరుపుకునే వారా?’ అనే ప్రశ్నకు పైవిధంగా స్పందించాడు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ, వేలెంటైన్స్ డే అన్నది మన దేశానికి సంబంధించినది కాదని అన్నాడు. అదీగాక, షూటింగ్ ల నిమిత్తం బిజీగా ఉండటంతో వేలెంటైన్స్ డే గుర్తుండేది కాదని.. ప్రేమికుల రోజును తాను నమ్మనని చెప్పాడు. చాలామందికి వేలెంటైన్స్ డే అంటే ఏమిటో కూడా సరిగ్గా తెలియదని నాని అన్నాడు.

  • Loading...

More Telugu News