: 'గరం' నిరాశ పరిచితే కనుక ఇక నా సినిమాలు చూడొద్దు: హీరో ఆది


‘గరం’ చిత్రం చూసిన తర్వాత ఎవరైనా కనుక నిరాశ చెందితే ఇక తన చిత్రాలను చూడవద్దని యువహీరో ఆది అన్నాడు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆది మాట్లాడాడు. గరం చిత్రం ప్రేక్షకులకు ఏమాత్రం బోరు కొట్టించదని, ఇది ఫ్యామిలీలను ఆకట్టుకుంటుందని, ఆ గ్యారంటీ తానిస్తున్నానని చెప్పాడు. ‘గరం’ కమర్షియల్ చిత్రమని.. అటువంటి చిత్రంలో క్లైమాక్స్ సీన్ చాలా సెంటిమెంట్ తో కూడి ఉందని అన్నాడు. ‘హోం ప్రొడక్షన్ లో చేయడం ఎలా అనిపించింది?’ అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. చాలా హ్యాపీగా ఉందని, ముఖ్యంగా తన తండ్రి సాయికుమార్ కి కృతఙ్ఞతలు తెలుపుతున్నానని .. ఈ సినిమాకి మంచి టాక్ రావడానికి కారణం ఆయనేనని ఆది అన్నాడు.

  • Loading...

More Telugu News