: అండర్-19 వరల్డ్ కప్ విజేత వెస్టిండీస్
అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా వెస్టిండీస్ నిలిచింది. భారత్ పై 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్ విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 146 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ పరుగుల వేటలో తడబడినప్పటికీ ఆ తర్వాత నిలదొక్కుకుని ఆడింది. కార్టీ, పాల్ నిలదొక్కుకుని ఆడి వెస్టిండీస్ జట్టును విజయతీరాలకు తీసుకువెళ్లారు. మూడు బంతులు మిగిలి ఉండగానే విండీస్ జట్టు విజయం సాధించింది. కాగా, భారత జట్టులో సర్ఫరాజ్ ఖాన్ (51) ఒక్కడే అర్ధ శతకం సాధించాడు. స్కోర్లు: భారత్ 145 పరుగులకు ఆలౌట్ (45.1 ఓవర్లలో), వెస్టిండీస్ 146/5 (49.3 ఓవర్లలో)