: సొంత రాష్ట్రంలో అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది: విద్యాబాలన్
సొంత రాష్ట్రంలో అవార్డు అందుకోవడం తనకు చాలా గర్వంగా ఉందని బాలీవుడ్ నటి విద్యాబాలన్ సంతోషం వ్యక్తం చేసింది. జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్న విద్యాబాలన్ కు కేరళకు చెందిన వరల్డ్ మలయాళీ కౌన్సిల్ సంస్థ, కైరళి టెలివిజన్ సంయుక్తంగా 'ప్రైడ్ ఆఫ్ కేరళ' అవార్డును అందజేశాయి. ఈ నేపథ్యంలోనే ఆమె పైవిధంగా వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఒక ట్వీట్ చేస్తూ, అవార్డు అందుకుంటున్న సందర్భంగా తీసిన ఒక ఫొటోను కూడా ఆమె పోస్టు చేసింది. కాగా, పరిణీత, ద డర్టీ పిక్చర్, నో వన్ కిల్డ్ జెసికా లాంటి సినిమాల ద్వారా విద్యాబాలన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అమితాబ్, నవాజుద్దీన్ సిద్ధిఖిలతో కలిసి ‘తీన్’ అనే చిత్రంలో విద్యాబాలన్ నటిస్తోంది.