: పంజాగుట్టలో ప్రేమికులను అడ్డుకుంటున్న భజరంగ్ దళ్ కార్యకర్తల అరెస్ట్
వేలంటైన్స్ డేను నిరసిస్తూ, రోడ్లపై నిరసన ప్రదర్శనకు దిగడమే కాకుండా, ఆ దారిలో బైకులపై వెళుతున్న జంటలను అడ్డుకుంటున్న భజరంగ్ దళ్ కార్యకర్తలను హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న పంజాగుట్టలో పోలీసులు అరెస్ట్ చేశారు. దళ్ హైదరాబాద్ కార్యదర్శి కిరణ్ కుమార్ తో పాటు మరో ఐదుగురు అరెస్టయిన వారిలో ఉన్నారు. అంతకుముందు ప్రజలు, ముఖ్యంగా యువత పాశ్చాత్య సంస్కృతిని అనుకరించడం మానివేయాలని, జాతి సంస్కృతిని గౌరవించాలని వారు నినాదాలు చేశారు. ఆ మార్గంలో వస్తున్న జంటలను అటకాయించారు. దీనిపై స్పందించిన పంజాగుట్ట సీఐ మోహన్ కుమార్, వారిని అరెస్ట్ చేసి సమీపంలోనే ఉన్న స్టేషనుకు తరలించారు.