: ఢిల్లీలో ఘోరాతి ఘోరం... సిజేరియన్ అయిన గంటల వ్యవధిలో యువతిపై అఘాయిత్యం!
సభ్య సమాజం తలదించుకోవాల్సిన దారుణాతి దారుణమైన ఘటన ఇది. బిడ్డను కన్న గంటల వ్యవధిలో ఓ మహిళ అత్యాచారానికి గురైంది. డీఎస్పీ సురేష్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఓ పోలీసు అధికారి భార్య నెలలు నిండి, హర్యానాలోని ఝాజ్జర్ జిల్లా పరిధిలోని ఆసుపత్రిలో చేరింది. వైద్యులు సిజేరియన్ చేయగా ఓ పాప జన్మించింది. అనంతరం ఆమెను ఐసీయూలో చేర్చగా, వైద్యుడి దుస్తుల్లో ఉన్న ఓ కామాంధుడు ఆమెపై అత్యాచారం చేశాడు. ఒంటిగంటకు అమెకు సిజేరియన్ చేశారని, 3:20 గంటల సమయంలో ఈ దురదృష్టకర ఘటన జరిగిందని అనంతరం ఐసీయూ నుంచి ఓ వైద్యుడి దుస్తుల్లో ఉన్న నిందితుడు బయటకు రావడం సీసీ కెమెరాల్లో రికార్డయిందని వివరించారు. కాగా, ఇదే వ్యక్తి, అదే రహదారిలోని మరో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ నంటూ మరో యువతి దగ్గరకు వెళ్లాడు. అతని చేష్టలు, అభ్యంతరకర తీరు, తనను తాకుతున్న విధానాన్ని గమనించిన ఆమె కేకలు వేయగా, అక్కడి నుంచి పారిపోయాడని సురేష్ కుమార్ వివరించారు. అన్ని సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తున్నామని, ఆ వ్యక్తిని గుర్తించే చర్యలు చేపట్టామని తెలిపారు.