: సునందను ఎవరు చంపారు?... ఐదు గంటల పాటు శశి థరూర్ ను విచారించిన ఢిల్లీ సిట్
సునందా పుష్కర్ హత్య కేసులో కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ను ఢిల్లీ ప్రత్యేక పోలీసు బృందం మరోసారి ప్రశ్నించింది. దాదాపు 5 గంటల పాటు విచారణ సాగగా, సునందను ఎవరు చంపారన్న ప్రశ్నను పలుమార్లు అడిగినట్టు తెలుస్తోంది. కాగా, శశిథరూర్ మాత్రం ఔషధాల మోతాదు ఎక్కువగా తీసుకోవడం వల్లే ఆమె మరణించిందని, అంతకుమించి మరేమీ జరగలేదని సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా, తొలుత సునందా పుష్కర్ సహజమరణం చెందారన్న నిర్ణయానికి వచ్చిన పోలీసులు, ఆపై ఆమెది అనుమానాస్పద మృతిగా భావించి కేసు విచారణ ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. "ఒకటి మాత్రం నిజం. ఆమె సహజంగా మరణించలేదు. మా విచారణ ప్రకారం ఆమెది అసహజ మరణమే. మరిన్ని సాక్ష్యాల కోసం విచారణ జరుగుతోంది. ఇంతకన్నా ఇంకేమీ చెప్పలేం" అని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ వివరించారు.