: సంవత్సరం క్రితం ఏర్పడ్డ ప్రేమ ఇది: కేజ్రీవాల్


ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు గడిచిన సందర్భంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. "గత సంవత్సరం ఇదే రోజున ఢిల్లీ నగరం 'ఆప్'తో ప్రేమలో పడింది. ఈ బంధం దృఢమైనది, కలకాలం నిలుస్తుంది" అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, ప్రజల సమస్యలను మరింత లోతుగా తెలుసుకునేందుకు, నేడు రెండు గంటల పాటు కేజ్రీవాల్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గత సంవత్సరం ఫిబ్రవరి 14న ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News