: ఓ మై గాడ్... ఎలాగోలా యూరప్ వెళ్లాలనుకునే వారు ఎంచుకుంటున్న ఒళ్లు గగుర్పొడిచే మార్గాలివి!


ఐఎస్ఐఎస్ ఉగ్రవాదం వేళ్లూనుకున్న దేశాల్లో జీవనం దుర్భరంగా మారగా, ఎలాగైనా యూరప్ కు వలస వెళ్లాలని భావిస్తున్న శరణార్థులు ఎంచుకుంటున్న ప్రాణాంతక మార్గాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. తనిఖీల్లో భాగంగా స్పెయిన్ భద్రతాదళాలు అక్రమమార్గాల ద్వారా దేశాలు దాటుతున్న వారి చిత్రాలను విడుదల చేశాయి. ఒక వ్యక్తి కారు బంపర్ లోపలి భాగంలో తాళ్లతో కట్టుకుని ప్రయాణిస్తుండగా, మరొకతను డ్రైవర్ వెనుక బ్యాక్ రెస్ట్ ను తొలగించి అందులో ఇరుక్కుని అచ్చం కుర్చీలా మారి, పైన లెదర్ సీట్ కవర్ కప్పుకున్నట్టు ఉన్నాయి. వీరికి ఇటువంటి సలహాలు స్మగ్లర్ల నుంచే వస్తున్నాయని భద్రతా దళాలు వ్యాఖ్యానించాయి.

  • Loading...

More Telugu News