: నెల్లూరు జిల్లాలో స్వల్ప భూకంపం


నెల్లూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి భూప్రకంపనలు నమోదయ్యాయి. జిల్లా పరిధిలోని వరికుంటపాడు, దుత్తలూరు, వింజమూరు తదితర మండలాల్లో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలతో వీధుల్లోకి పరుగులు తీశారు. మూడు నుంచి ఏడు సెకన్లపాటు భూమి కంపించిందని ప్రజలు తెలిపారు. వింజమూరు మండలంలోని చాకలికొండ, బత్తినవారి పల్లి గ్రామాల్లో ప్రకంపనల తీవ్రత అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ గ్రామాల్లోని పలు ఇళ్లకు బీటలు పడ్డట్టు ప్రాథమిక సమాచారం. కాగా, గడచిన మూడు నెలల్లో నెల్లూరు జిల్లాలో 11 సార్లు ప్రకంపనలు నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News