: ఘనంగా చెల్లి పెళ్లి చేసిన బాలీవుడ్ నటి


ప్రముఖ బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ తన చెల్లి పెళ్లిని ఘనంగా చేసింది. ఆర్మీలో పని చేసిన నిమ్రత్ తండ్రి 2002లో కాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. అప్పటి నుంచి కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకున్న నిమ్రత్ కౌర్ అన్నీ తానై చెల్లి పెళ్లి చేసింది. క్యాడ్ బరీ యాడ్ తో అభిమానులను సంపాదించుకున్న నిమత్ర్ కౌర్, 'లంచ్ బాక్స్' సినిమాతో వెండితెర అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా, అక్షయ్ కుమార్ తో కలిసి 'ఎయిర్ లిఫ్ట్'లో నటించి అభిమానులను అలరించింది. ఈ సందర్భంగా 'చెల్లి పెళ్లి సరే...మరి నీ పెళ్లెప్పుడు?' అని అడిగిన మీడియా ప్రతినిధులకు 'దానికింకా టైముంద'ని నవ్వుతూ తెలిపింది.

  • Loading...

More Telugu News