: మాతృభూమికి వెళ్లిపోతామంటున్న సిరియన్లు, ఇరాకీలు


ఇరాక్, సిరియాలో ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల ఆగడాలు భరించలేక దేశం వీడి యూరప్ చేరిన శరణార్థుల్లో కొద్దిమంది మళ్లీ స్వదేశానికి వెళ్లిపోతామని అంటున్నారు. పోప్, ఐక్యరాజ్యసమితి కోరిక మేరకు యూరోపియన్ దేశాలన్నీ శరణార్థులను పంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది ఇరాక్, సిరియాకు చెందిన వారిని యూరోపియన్ యూనియన్ ఫిన్లాండ్ దేశానికి కేటాయించింది. దీంతో వారంతా ఫిన్లాండ్ చేరుకున్నారు. అయితే అక్కడ కురుస్తున్న హిమపాతం ధాటికి విలవిల్లాడిపోయారు. దీంతో ఆ దేశ పౌరసత్వం కోసం చేసుకున్న దరఖాస్తును వాపస్ చేయాలని కోరుతున్నారు. ఇంత చలికి తట్టుకోలేమని, స్వదేశం వెళ్లిపోతామని వారు చెబుతున్నారు. ఇప్పటికే వందల మంది ఇరాకీలు స్వదేశానికి తరలిపోయారని ట్రావెల్ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. కాగా, ఫిన్లాండ్ ఉత్తర ధృవానికి దగ్గరగా ఉండడంతో అక్కడ ఎప్పుడూ హిమపాతం ఉంటుంది. దీంతో అక్కడ చలికి తట్టుకోవడం చాలా కష్టం. అదీ కాక ఇరాక్, సిరియాల్లో ఎండలు విపరీతంగా కాస్తాయి. అటువంటి వాతావరణానికి అలవాటు పడ్డ వారు కావడంతో ఈ చలిని తట్టుకోలేకపోతున్నారు.

  • Loading...

More Telugu News