: హిందూపురం డిగ్రీ కాలేజీ విద్యార్థినిపై యాసిడ్ దాడి
హిందూపురంకు చెందిన ఓ విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది. స్థానిక బాలయేసు కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై కొందరు దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. విద్యార్థిని నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వెనుకనుంచి వచ్చిన దుండగులు ఆమెపై యాసిడ్ పోసి పరారయ్యారు. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఆమెకు స్వల్ప గాయాలైనట్టు వైద్యులు వెల్లడించారు. కాగా, దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.