: రాహుల్ గాంధీ హఫీజ్ సయీద్ భాషలో మాట్లాడుతున్నారు: బీజేపీ


ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన జేఎన్ యూ విద్యార్థి నేత కన్నయ్యను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని విమర్శించిన రాహుల్ గాంధీపై బీజేపీ మండిపడింది. కన్నయ్యను అదుపులోకి తీసుకొని, ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయడంతో పాటు, మరో ఎనిమిది మంది విద్యార్థులను యూనివర్సిటీ బహిష్కరించింది. దీనిని రాహుల్ గాంధీ విమర్శించారు. దీనిపై బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ మాట్లాడుతూ, దేశవ్యతిరేక ఆందోళనను సమర్థిస్తూ ట్వీట్ చేసిన హఫీజ్ సయీద్ భాషలో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు వీరజవాన్ల ప్రాణత్యాగానికి అవమానకరమని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News