: ప్రేమ విఫలమవడంతో ఆ ఏనుగు 15 కార్లను తన్నేసింది!


తన సహచరి తనను వదిలేసి ఇంకో ఏనుగుతో వెళ్లిపోయింది. అంతే.. ఆ ఏనుగుకు కోపం ముంచుకొచ్చింది. ఉన్నపళంగా రోడ్డెక్కేసింది. అక్కడ పార్క్ చేసి ఉన్న 15 కార్లను తన్నిపడేసింది. ఇంత బీభత్సం సృష్టించినా, అక్కడే నిల్చుని ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్న కార్ల యజమానులు, పర్యాటకులను మాత్రం ఏనుగు ఏమీ చేయకుండా వెళ్లిపోయింది. దీంతో అంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన చైనాలోని గ్జిషువాంగ్ బన్నా ప్రిఫెక్చర్ నేచర్ రిజర్వ్ ఫారెస్ట్ లో చోటుచేసుకుంది. దీని గురించి అధికారులు మాట్లాడుతూ, వారం క్రితం ఈ ఏనుగుతో సహజీవనం చేసిన ఏనుగు ... మధ్యలో వచ్చిన మరో ఏనుగుతో కలసి వెళ్లిపోయిందని తెలిపారు. అప్పటి నుంచి మూడీగా ఉంటున్న ఈ ఏనుగు ఇలా రోడ్డెక్కిందని వారు చెప్పారు. దెబ్బతిన్న కార్ల యజమానులకు ఫారెస్ట్ అధికారులు నష్టపరిహారం ఇచ్చారు. విరహం మనుషులకే కాదు, తమకూ ఉంటుందని ఈ ఏనుగు, ఆ ప్రకారంగా ప్రవర్తించిందన్న మాట!

  • Loading...

More Telugu News