: డొక్కా... మీరింకా కాంగ్రెస్ సంస్కృతిలోనే ఉన్నారు!: వర్ల రామయ్య చురక


ఎస్సీ వర్గీకరణపై పూర్తి అవగాహన తెచ్చుకుని మాట్లాడాలంటూ ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు డొక్కా మాణిక్య వరప్రసాద్ సూచించడంపై ఆ పార్టీ నేత వర్ల రామయ్య ఆగ్రహించారు. డొక్కా ఇంకా కాంగ్రెస్ సంస్కృతిలోనే ఉన్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీలో అన్ని కులాలకు చంద్రబాబే నాయకుడని విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశం సున్నితమైందని, ఎస్సీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని వర్ల తెలిపారు. ప్రభుత్వాన్ని విమర్శించే బదులు దళితుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను పరిశీలించాలని డొక్కాకు సూచించారు.

  • Loading...

More Telugu News