: చంద్రబాబును మళ్లీ కలసిన వైసీపీ ఎమ్మెల్యే
ఇటీవల సీఎం చంద్రబాబును కలసిన వైసీపీ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మళ్లీ ఈ రోజు కూడా కలిశారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో బాబును కలసిన ఆయన, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఇదిలా ఉంచితే, జలీల్ టీడీపీలో చేరేందుకే చంద్రబాబును మొన్న కలిశారంటూ మీడియాలో వచ్చిన ప్రచారంతో వైసీపీ అప్రమత్తమైంది. దీంతో తాను టీడీపీలో చేరడం లేదని, తన నియోజకవర్గ సమస్యలపైనే సీఎంను కలిశానని జలీల్ తరువాత స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ బాబును కలవడం కొత్త సందేహాలకు తావిస్తోంది.