: వేలంటైన్స్ డేకు 'స్కైప్' బంపర్ ఆఫర్


'ప్రేమికుల రోజు' పేరుతో పలు సంస్థలు, వెబ్ సైట్లు పలు ఆఫర్లు కుమ్మరిస్తున్నాయి. యువతలో వేలంటైన్స్ డే పట్ల ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. తాజాగా వీడియో కాలింగ్ సర్వీస్ సంస్థ స్కైప్ ప్రేమికులకు కొత్త ఆఫర్ ప్రకటించింది. వేలంటైన్స్ డే నాడు తమ మనసులోని ప్రేమను నచ్చినవారితో పంచుకునేందుకు సరికొత్త వీడియోకార్డ్ సర్వీసును అదనంగా జోడించినట్టు తెలిపింది. దాంతో తమకు ఇష్టమైన వారి పట్ల ప్రేమను వ్యక్తం చేస్తూ సొంతంగా వీడియోను రికార్డు చేసుకుని, దానిని ఎగిరే హార్ట్ సింబల్స్ యానిమేషన్ తో అందంగా మార్చుకునే సౌకర్యాన్ని స్కైప్ కల్పిస్తోంది. ముందుగా ఐఫోన్, ఐప్యాడ్ లలో స్కైప్ యాప్ ఓపెన్ చేయగానే హార్ట్ సింబల్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయడంతో వీడియో రికార్డు అవుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో అయితే '+' బటన్ ను ప్రెస్ చేయగానే హార్ట్ సింబల్ ను సెలక్ట్ చేసుకోవచ్చు. ఆ వెంటనే వీడియో రికార్డు అవుతుంది. ఈ వీడియోను ఇతర సోషల్ మీడియా సైట్లలోనూ షేర్ చేసుకోవచ్చని స్కైప్ తెలిపింది. 48 గంటల పాటు ఈ వీడియోకార్డ్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.

  • Loading...

More Telugu News