: నారాయణఖేడ్ పోలింగ్ లో విషాదం... విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మృతి
మెదక్ జిల్లా నారాయణఖేడ్ లో జరుగుతున్న ఉపఎన్నిక పోలింగ్ లో విషాదం చోటు చేసుకుంది. ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న వీరాసింగ్(48) అనే హెడ్ కానిస్టేబుల్ హఠాన్మరణం చెందాడు. కొండాపూర్ గ్రామ పోలింగ్ కేంద్రం వద్ద ఈ ఘటన జరిగింది. వీరాసింగ్ మరణంతో అక్కడున్న పోలీసులు, ఎన్నికల సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. మరోవైపు ఖేడ్ లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుండగా, భారీ స్థాయిలో పోలింగ్ శాతం నమోదవుతోంది.