: యాపిల్ నుంచి భారత మార్కెట్ లోకి కొత్త ఐఫోన్, ఐప్యాడ్


టెక్నాలజీ దిగ్గజ సంస్థ యాపిల్ నుంచి మార్చిలో కొత్త శ్రేణి ఐఫోన్, ఐప్యాడ్ మోడల్స్ భారత మార్కెట్ లోకి రాబోతున్నాయి. 4 అంగుళాల స్క్రీన్ ఉన్న ఈ ఐఫోన్ మోడళ్లను 'ఐఫోన్ 5ఎస్ఈ' గా పిలుస్తారు. ఐఫోన్ 6, 6ఎస్ మోడళ్ల తరహాలో పూర్తిస్థాయి హార్డ్ వేర్ అప్ గ్రేడ్ తో ఈ 5ఎస్ఈని యాపిల్ ప్రవేశపెడుతున్నట్టు తెలుస్తోంది. దానిద్వారా స్క్రీన్ సైజ్ పెరగకుండానే ఫాస్టెస్ డివైస్ ను యాపిల్ కస్టమర్లకు అందించనుంది. దాంతో పాటే సరికొత్త ఐప్యాడ్ ఎయిర్ మోడల్ ను కూడా ఒకేసారి విడుదల చేయనున్నట్టు టెక్నాలజీ బ్లాగ్ 9టు5మ్యాక్ తెలిపింది. మార్చి 15న విడుదల కానున్న వీటి అమ్మకాలు కూడా వెంటనే ప్రారంభమవ్వచ్చని పేర్కొంది.

  • Loading...

More Telugu News