: నిజమే...యువరాజ్ కు సరైన అవకాశాలు రావడం లేదు: ధోనీ


సచిన్, సెహ్వాగ్, ద్రవిడ్ వంటి దిగ్గజాల సరసన భారత జట్టు తురుపుముక్కగా కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్ కు బ్యాటింగ్ ఆర్డర్ లో సరైన అవకాశాలు రావడం లేదని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిప్రాయపడ్డాడు. వరల్డ్ కప్ విజయం తరువాత కేన్సర్ బారినపడిన యువరాజ్ సింగ్ దానిని జయించి, ఎంతో శ్రమించి టీమిండియాలో తిరిగి చోటు సంపాదించాడు. అనంతరం అతనికి మిడిల్ ఆర్డర్ చివర్లో ఆరు లేదా ఏడు స్ధానాల్లో బ్యాటింగ్ చేసే అవకాశం వస్తోంది. దీంతో యువరాజ్ కు క్రీజులో కుదురుకునే అవకాశం చిక్కడం లేదు. వస్తూనే విరుచుకుపడాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ వ్యక్తిగతంగా తక్కువ స్కోరుకే పరిమితమయ్యే పరిస్థితి నెలకొంది. దీనిపై విమర్శలు వస్తున్నాయి. వీటిపై స్పందించిన ధోనీ, టీమిండియాలో టాప్ 5 బ్యాటింగ్ ఆర్డర్ ను మార్చలేని పరిస్థితి నెలకొందని అన్నాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లు కుదురుకున్నారని, వారిని విడదీయలేమని, ఆ తరువాత విరాట్ కోహ్లీ, సురేష్ రైనాలకు అసాధారణమైన రికార్డు ఉందని అన్నాడు. వారి తరువాత బ్యాటింగ్ ఆర్డర్ లో తాను ఉన్నానని ధోనీ చెప్పాడు. యువరాజ్ కు ప్రమోషన్ అవసరమే కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదని ధోనీ పేర్కొన్నాడు. కానీ యువీకి అవకాశాలు రావాలని ధోనీ అభిలషించాడు.

  • Loading...

More Telugu News