: గిన్నీస్ వరల్డ్ రికార్డులో కువైట్ జాతీయ జెండా
కువైట్ జాతీయ జెండా అరుదైన రికార్డును సాధించింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా గిన్నీస్ వరల్డ్ రికార్డుకెక్కింది. సౌత్ ఈస్ట్ కువైట్ పరిధిలోని మినా అబ్దుల్లా ప్రాంతంలో ఓ రిమోట్ కంట్రోల్ విమానంతో ఈ జెండాను ఆకాశంలో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను వీక్షించిన ప్రత్యేక బృందం గిన్నీస్ వరల్డ్ రికార్డులో దీనిని నమోదు చేసుకుంది.